కేజ్రీవాల్ పై రాబర్ట్ వాద్రా ఫైర్

posted on: Oct 7, 2012 5:33PM

Kejriwal Robert Vadra, Robert Vadra assets, Robert Vadra Chidambaram, Robert Vadra Kejriwalక్విడ్ ప్రోక్ కింద వందలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి ఆరోపణలపై రాబర్ట్ వాద్రా మండిపడ్డాడు. తనపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ధీటుగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదని, ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, చట్టబద్దంగానే బిజినెస్ చేస్తున్నానని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై విమర్శలు చేయడం తగదన్నారు. మీ వద్ద తన వ్యాపారానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్లవచ్చునని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...