నేటి నుంచి కేదారనాథునికి పూజలు

posted on: Sep 11, 2013 7:47AM

 

ప్రకృతి సృష్టించిన జల విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రముఖ శైవ క్షేత్రం కేదార్‌నాద్‌లో ఈ బుధవారం నుంచి పూజలు మొదలు కానున్నాయి. గత 86 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సైన్యం సహాయక చర్యలు నిర్వహించిన ఈ క్షేత్రంలో ఇక పరిస్థితి పూర్తి చక్కబడలేదు.. అయినా ఇప్పటికే చాలా రోజులు ఆలస్యం కావటంతో నేటి నుంచి పూజలు నిర్వహించటానికి ఆలయ అధికారులతో పాటు కమిటీ సభ్యులు కూడా తీర్మానించారు.

24 మంది పురోహితులతో కూడిన బృంధం ఆలయ కమిటీ సమక్షంలో ఈ రోజు శాస్త్రోక్తంగా పూజలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పూజలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినా. భక్తులను మాత్రం ఇప్పట్లో అనుమతించే అవకాశం లేదంటున్నారు ఆలయ కమిటి.

google-ad-img
    Related Sigment News
    • Loading...