Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డామిట్ ..కథ అడ్డం తిరిగింది
posted on: Jul 4, 2022 11:52AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు గత కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన వచ్చింది మొదలు, ప్రతి అడుగులో అవరోధాలు,అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల జాతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. జాతీయ పార్టీ, జాతీయ ప్రత్యామ్నియ ప్రణాళిక ఆలోచనలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఫార్మ్ హౌస్ గడప దాట లేదు.
మరోవంక వరితో మొదలైన కేంద్రం పై యుద్ధం ఆశించిన ఫలితం సాధించలేక పోయింది. ఇక ఇప్పడు తాజాగా, రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం జరిగిన మరు క్షణం నుంచి, కేసీఆర్, కేటీఆర్ బీజేపీని బద్నాం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతూ వచ్చారు. అయితే చివరాఖరుకు, కథ అడ్డం తిరిగింది. బీజేపీని, ప్రధాని మోడీని బద్నాం చేసేందుకు, ఫ్లెక్సీల యుద్ధం చేసినా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్బ్యర్ది యశ్వంత్ సిన్హా తీసుకొచ్చి హడావిడి చేసినా, అదే అదనుగా ప్రధాని మోడీ పై ‘’సేల్స్ మ్యాన్’ వంటి విమర్శలు చేసినా, జాతీయ, అంతర్జాతీయ విషయాలు అన్నింటినీ కలబోసి ప్రశ్నలు సంధించినా, చివరకు, వృధా ప్రయాసే మిగిలిందని, తెరాస నేతలే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం ఇస్తారని ఆశించారు. ఆయనకు ఆయనే, ముందుగానే మోడీ, తనను టార్గెట్ చేస్తారని ప్రకటించుకున్నారు. అయితే, కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా, ఏర్పాటు చసిన విజయ సంకల్ప సభలో,ప్రధాని మోడీ 30 నిముషాలకు పైగా చేసిన ప్రసంగంలో కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అసలు కేసేఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో ఏమి చేసిందో, ముందు ముందు ఏమి చేస్తుందో, నేరుగా ప్రజలకే చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని తేల్చేశారు. దీంతో కేసేఆర్ కు మోడీనుంచి తిట్లదండకం ఆశించిన తెరాస నేతలకు మరో మారు ఆశాభంగం ఎదురైంది. ముఖ్యమత్రి కేసీఆర్ ప్రశ్నలకు సమధానం చెప్పక పోగా అసలు, ఆయన ప్రస్తావనే చేయక పోవడం, ప్రధాని మోడి, ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ను పూచిక పుల్లకంటే హీనంగా పక్కన పెట్టడం, అవమానంగా భావిస్తున్నారు.
సరే, అంత మాత్రం చేత, తెరాస ఇక చేతులు ముడుచుకుని కుర్చుంటుందని కాదు. కానీ, కేంద్రంపై యుద్ధం పేరుతో బీజేపీని టార్గెట్ చేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేయక తప్పదని, ఎదంటే అది అనేస్తే కుదరదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే విధంగా తెరాస ఎన్నికల వ్యూహాన్ని సవరించుకోవలసి ఉంటుదని అంటున్నారు.
అదలా ఉంటే విజయసంకల్ప సభ ఎవరూ ఉహించని విధంగా సక్సెస్ అయింది. నిజానికి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం బహిరంగ సభ ఏర్పాటు ప్రతిపాదన చేసినప్పుడు, పార్టీ జాతీయ నాయకత్వం తటపటాయించింది, సక్సెస్ కాకపోతే, అభాసు పాలవుతామని, ఒకటికి పదిసార్లు అలోచించి, సమాలోచనలు జరిపి చివరకు ఓకే చెప్పింది. అయినా, వ్యూహాత్మకంగా, ఉభయతారకంగా, రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు, కేంద్ర మంత్రులు, వివిదః రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర కీలక నేతలను ఇంచార్జిలుగా నియమించి, మూడు నాలుగు రోజుల ముందునుంచి జనసంపర్క యాత్రలు నిర్వహించింది. ఆ విధంగా సభ సక్సెస్ కావడమే కాకుండా, రాష్ట్రం’ పై బీజేపీ ఫోకస్ ఎంత బలంగా వుందో, జతేఅయ్ స్థాయిలో బీజేపీ శక్తీ సామర్ధ్యాలు ఏమిటో చెప్పకనే చెప్పినట్లయింది.అంతే కాదు, కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి ప్రసంగించిన మోడీ, ఇది వన్ టైం ఎఫైర్ కాదు, ఈ దండ యాత్ర ఇలా కొనసాగుతూనే ఉండాలని సూచించారు. సో.. ఇలాంటి యాత్రలు, దండయాత్రలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి, అనే సంకేతం అయితే వచ్చింది.
ఓవరాల్’’గా చూస్తే, బీజేపీ, తెరాసల మధ్య సాగుతున్న వ్యూహాత్మక యుద్దంలో ప్రస్తుతానికి అయితే బీజేపీ పై చేయి సాధించింది. అయితే, ఇక్కడితో కథ ముగిసినట్లు కాదని, వ్యూహాలు మార్చుకునేందుకు తెరాసకు ఇంకా సమయం ఉందని, పరిశీలకులు అంటున్నారు. అయితే, కేంద్రంపై యుద్ధం విషయంలో ఇప్పటికే చాలా దూరం వెళ్ళిన కేసీఆర్, వెనకడుగు వేస్తారా, అంటే రాజకీయ పరిశీలకులు మాత్రం అనుమానమే అంటున్నారు.



.webp)


