TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీకి మోహం చాటేయడానికే కేసీఆర్ నిర్ణయం!

Published on: Wed May 25, 2022 10:43AM

ప్రధాని పర్యటన సమయంలో రాష్ట్రంలో ఉండకుండా దేశ వ్యాప్త పర్యటన పెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేశారు.  అలా వచ్చేయడానికి తన పర్యటనకు జాతీయ స్థాయిలో ఎటువంటి స్పందనా రాకపోవడమే కారణమని చెబుతున్నారు. ఏ విధంగా ప్రయత్నించినా తన జాతీయ అజెండాకు మద్దతు సమీకరించడంలో విఫలం కావడంతో ఆయన చివరి యత్నంగా కనీసం కాంగ్రెస్ తో నైనా సయోధ్య కుదుర్చుకుని రాష్ట్రపతి ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తానంటూ ప్రతిపాదించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇక ఎక్కడికీ వెళ్లే అవకాశం లేక స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి మోడీ పర్యటన సందర్భంగా ఆయన ఏం చేస్తారన్న విషయంలో కూడా స్పష్టత ఇచ్చేశారు. మోడీ వ్యతిరేకత విషయంలో జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడంలో విఫలమైన ఆయన ఇప్పుడు ఇక రాష్ట్ర పర్యటనలో మోడీకి మొహం చాటేయడానికే నిర్ణయించుకున్నారు.

ప్రొటో కాల్ ప్రకారం ప్రధాని అధికారిక పర్యటలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాటించాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించేందుకే నిర్ణయించుకున్నారు.  తెలంగాణలో గురువారం మోడీ హైదరాబాద్ లో ఇండియన్  స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రొటో కాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం కూడా వచ్చింది. అయినా కేసీఆర్ డుమ్మా కొట్టడానికే నిర్ణయించుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా అందుకు కారణంగా పీఎంవో నుంచే కేసీఆర్ కు ఆ కార్యక్రమంలో పాల్గొన వద్దని సూచన వచ్చిందని అంటున్నారు.

ఆ వాదనను పీఎంవో కొట్టి పారేసింది. గతంలో కూడా కేసీఆర్ హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అలాగే ఇక్రిశాట్ లో కార్యక్రమానికీ డుమ్మా కొట్టారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ వర్గాలు పీఎంవో సూచన మేరకే నంటూ చెప్పుకొచ్చారు.

అప్పుడు కూడా పీఎంవో టీఆర్ఎస్ వాదనను కొట్టి పారేసింది.  మొత్తం మీద ఉద్దేశ పూర్వకంగానే కేసీఆర్ మోడీకి ఎదురుపడకుండా అవాయిడ్ చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. విపక్షాలు కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటన అంటూ బయలు దేరినప్పుడే మోడీకి ఎదురుపడే ధైర్యం లేకే కేసీఆర్ ఈ పర్యటన పెట్టుకున్నారని విమర్శించిన సంగతి తెలిసిందే.