కృత‌జ్ఞత‌లు తెలిపిన కెసిఆర్‌

 

తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీకి ప్రముఖంగా సోనియా గాంధికి, ప్రదాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. దీంతో పాటు ఉద్యమంలో త‌న‌తో పాటు క‌లిసి న‌డిచిన క‌వులు క‌ళాకారులు నాయ‌కులు, పాత్రికేయ‌ల‌కు కూడా త‌న కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు.

త‌రువాత తెలంగాణ ఏర్పాటును అందుకు కాంగ్రెస్ సూచించిన అన్ని మార్గాల‌ను స్వాగ‌తించిన కెసిఆర్ ఉమ్మడి రాజ‌ధాని విష‌యం అన్న విష‌యంలో మాత్రం కాంగ్రెస్ నుంచి మరింత క్లారిటీ రావాల‌ని కోరారు. దీంతో పాటు ఇప్పటితో మ‌న పని అయిపోయిన‌ట్టుకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వ‌ర‌కు ప్రతి తెలంగాణ వాది అప్రమ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

దీంతో పాటు తెలంగాణ ఏర్పడిన ప‌క్షంలో టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో క‌లుపుతాను అన్న మాట‌ను కూడా కెసిఆర్ ప్రస్థావించారు. ఇప్పుడే అంతదూరం ఆలొచించాల్సిన అవ‌స‌రం లేద‌న్న కెసిఆర్, పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయిన త‌రువాత త‌ప్పుకుండా ఆ విష‌యం గురించి ప్రక‌ట‌న చేస్తామ‌న్నారు. తెలంగాణ సాదనే కాదు తెలంగాణ పున‌ర్మిమాన ప్రక్రియ‌లో కూడా టిఆర్ఎస్ చురుకైన పాత్ర పోషిస్తుంద‌ని ప్రక‌టించారు.