TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణాలో మంటలు ... కెసిఆర్ కుటుంబం విహార యాత్రలు

Published on: Tue Mar 27, 2012 12:25PM

ఒకవైపు తెలంగాణా ప్రాంతం మళ్ళీ ఆందోళనలతో అట్టుడికి పోతోంది. తెలంగాణా కావాలంటూ ఇద్దరు అగ్ని కీలలకు ఆహుతి అయ్యారు. తెలంగాణా ప్రజలు టి ఆర్ ఎస్ పిలుపు మేరకు మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్లపై ఆందోళన చేస్తున్నారు. తెలంగాణా అంతటా సమ్మె చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు తెలంగాణా కోసం పార్లమెంట్ ను స్థంభింపజేస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే మరోవైపు కెసిఆర్ కుటుంబ సభ్యులు హాయిగా విహార యాత్రలో సేద తీరుతున్నారు.

 

కెసిఆర్ సతీమణి శోభ, కేసిఆర్, ఇద్దరు సోదరీమణులు, కెటిఆర్ బావమరిది, తదితరులు భద్రాచలంలో రాములవారిని సందర్శించుకున్న అనంతరం పాపికొండల విహారయాత్రకు బయలుదేరి వెళ్ళారు. కెసిఆర్ కుటుంబ సభ్యులకోసం ప్రత్యేకంగా ఒక ఏ.సి. లాంచీని ఏర్పాటు చేశారు. ఈ లాంచీలోనే వారికి వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటుచేశారు. గత రాత్రి వారు పాపికొండల మధ్యనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో సేదతీరారు. ఒకవైపు తెలంగాణా ప్రాంతం ఆందోళనలతో భగభగ మండుతుంటే కెసిఆర్ కుటుంబ సభ్యులు మాత్రం ఏ.సి. లాంచీల్లో విహారయాత్రలకు వెళ్ళడం ఎంతవరకు సమంజసమన్న ఆరోపణలు వినవస్తున్నాయి.