Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేంద్రమంటే కేసీఆర్ కు భయమా?
posted on: Jun 4, 2021 6:23PM
మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాస ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు.ఇది అనూహ్య పరిణామం కాదు. అనుకున్నదే జరిగింది. అలాగే, తమ నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా, సహజంగానే ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, గతంలో ఇవే విమర్శలు మరొకరు చేసినప్పుడు, ఈయనే ఆ విమర్శలను ఖండించారు. ఇప్పుడు ఈయన చేసిన విమర్శలను, తెరాస ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర రెడ్డి ఖండించారు. అయితే కేసీఆర్’ని ఈటల విమర్శించడం ఎంత సహజమో, ఈటలను పల్లా ఓ పట్టుపట్టడం కూడా అంతే సహజం. ఈటల ప్రధానంగా తెరాసలో తమ ఆత్మగౌరవానికి భంగంకలిగిందని, అంటున్నారు. నిజంగా అంతగా ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగిందే నిజం అయితే, మెడ పట్టి గెంటే వరకు చూరుపట్టుకు ఎందుకు వెళ్ళాడారు,అనే ప్రశ్నకు ఈటల దగ్గర సమాధానం లేదు. అందుకే, ఆయన ఆ ఒక్కటి పక్కన పెట్టి మిగిలిన విషయాలు అన్నీ మాట్లాడుతున్నారు.
అదలా ఉంటే, పల్లా రాజేశ్వర రెడ్డితో పాటుగా ఇతర తెరాస నాయకులు కూడా ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల రక్షణ అని మండిపడ్డారు. అక్రమంగా సంపాందించిన తన ఆస్తులను కాపాడుకునేందుకు ఈటల అత్మగౌరవం, ట్యాగ్ తగిలింఛి నాటకాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. అయితే, ఈటల ఆత్మగౌరవం వంటి పెద్ద పెద్ద అంతాలు మాట్లాడి ఉన్న గౌరవం పోగొట్టుకున్నట్లుగానే, ఈటల అక్రమాస్తుల విషయం ప్రస్తావించి, తమ పరువు తామే తీసుకున్నారు. అందుకే, తెరాస నేతల ఆరోపణలు నిజమే అయితే , ఆ ఆరోపణలకు ఈటల కంటే ముందు అదికార పార్టీ నేతలే సమాధానం ఇవ్వవలసి ఉంటుందని, అంటున్నారు.
ఈ నేపధ్యంలో తెరాస నాయకుల మాటలను విశ్లేషించుకుంటే, తెరాస మంత్రిగా ఉంటూ, ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడ్డారు.. లక్షలు కోట్లు వెనకేసుకున్నారని తెరాస నాయకులే అంగీకరించినట్లు అవుతుంది. అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రి వర్గం అవినీతిమయం అని విపక్షాలు చేస్తున్న విమర్శలను పాక్షికంగా అయినా అంగీకరించినట్లు అవుతుంది. ఎవరైనా ఈ తీగ పట్టుకు లాగి,ఏ ‘పిల్లో’ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేస్తే, మొత్తంగా ఏడేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి డొంకంతా కదిలే ప్రమాదం లేక పోలేదు.నిజానికి ఈటల మీద వచ్చిన ఆరోపణలకు మించిన ఆరోపణలు ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్ల్యేల పై కూడా ఉన్నాయి. భూకబ్జాకేసుల్లో ఇరుకున్నఇతర పార్టీల ఎమ్మెల్యేలను భయపెట్టి పార్టులోకి లాక్కున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవ్వనీ పబ్లిక్ డొమైన్’ ఉన్న విషయాలే. ఇప్పుడు, ఆ లోతుల్లోకి వెళితే, సూది కోసం సోది కెళితే, పాత తప్పుడు తిరుగుళ్ళు బయట పడ్డాయి అన్నట్లు, అవుతుందని అంటున్నారు.
అదలా ఉంటే, ఈటలల పై పోటాపోటీగా విమర్శలుచేసే ఉత్సాహంలో తెరాస నాయకులు మరో సెల్ఫ్ గోల్ కూడా చేసుకున్నారని, విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈటల తమ అక్రమాస్తులను రక్షించుకుకునేందుకే, బీజేపీ పంచన చేరారని పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన ఆరోపణని విశ్లేషించుకుంటే, అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు బీజేపీలో చేరితే, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేదని, సర్కార్ తరపుయన్ రాజేశ్వర రెడ్డి చేతులెత్తేసారా, అని ప్రశ్నిస్తున్నారు.అలాగే, కేంద్రానికి కేసీఆర్ భయపడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కూడా ఈ వ్యాఖ్యలు బలం చేకురుస్తున్నాయని వివిశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే కేంద్రానికి ఎందుకు భయాడుతున్నారు? అన్న ప్రశ్న కూడా బలంగ్ వినవస్తోంది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు, రైతు చట్టాలకు సంబంధించి కరీంనగర్, నిజామబాద్ సభల్లో మోడీ మీద ఓ రేంజిలో రెచ్చిపోయిన కీసీఅర్, తర్వతా ఢిల్లీ వెళ్లి కాళ్ళ బేరానికి వచ్చారని, ఇక అక్కడి నుంచి రైతు చట్టాల ఊసే లేదని విపక్షాలు ఎప్పటినుంచో విమర్శిస్తున్నాయి. ఇప్పుడు, పల్లా పలుకులతో నిజంగానే కేసీఆర్ కేంద్రానికి భయపడుతున్నారు అనుకోవలసి వస్తోందని అంటున్నారు. అయితే, ఎందుకు భయడుతున్నారు .. అదేమీ రహస్యం కాదు .. దాల్ మే కుచ్’ నహీ .. బహుత్ ... బహుత్ కాలాహై.






