నేడు విజయవాడకు కేసీఆర్
Published on: Mon Dec 14, 2015 6:27AM

తెలంగాణ ముఖ్యమంత్రి సోమవారం నాడు విజయవాడకు వెళ్ళనున్నారు. తాను తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న ఆయత చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు ఆయన సతీసమేతంగా విజయవాడ వెళ్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్తారు. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలసి చండీ యాగం ఆహ్వాన పత్రికను అందజేస్తారు. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని సందర్శించి, ముక్కుపుడకను సమర్పించి పూజలు చేస్తారు.


