Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాగో అనలేదు కాని వెళ్లిపోవాల్సిందే
posted on: Aug 2, 2013 8:41PM

సీమాంద్ర ప్రజలకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగదు అంటునే మరోసారి కేసిఆర్ వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న సీమాంద్ర ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లిపోవాల్పిందే అన్నారు కెసిఆర్.హైదరాబాద్ టిఎన్‌జీవొలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కెసిఆర్ మరోసారి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణలో నివసిస్తున్న వారు ముఖ్యంగా ఇక్కడ ఓటు హక్కు కలిగిన వారంతా ఇక్కడి ప్రజలుగానే పరిగణింపబడతారని దిగ్విజయ్ సింగ్ చెప్పి 24 గంటలు కూడా కాక ముందే కెసిఆర్ చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి ఎలాంటి చర్యలు జరగకముందే కెసిఆర్ ఇలా మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలకు ప్రదాన్యత సంతరించుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న సీమాంద్రులు తమ భద్రత విషయంలో భయపడుతుంటే ఇప్పుడు కెసిఆర్ వ్యాఖ్యలతో ఆ భయం మరింత ఎక్కువయింది. అసలు తన ఎప్పుడు సీమాంద్రులను బాగో అనలేదని చెప్పిన కెసిఆర్. ఉద్యోగులు తప్పకుండా వెళ్లిపోవాలి అనటం బాగో అనటం కాదా అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా ఇలాంటి నాయకులు ఇరు పక్షాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






