TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యశోద ఆస్పత్రికి కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు

Published on: Thu Jul 10, 2025 1:10PM

 

 

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మాజీ సీఎంకు మరోసారి  డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరగ్గానే ఉందని బ్లడ్‌ షుగర్, సోడియం స్థాయిలు కొద్దిగా పెరిగాయని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశ్ఛార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో వైద్యులు తెలిపారు. 

ఈక్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్‌ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లే అవకాశముందని వారు వెల్లడించారు. అయితే గత ఐదు రోజులుగా కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు. 

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఒపెన్ కోర్టుకు తాను రాలేనని.. ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్‌కు గులాబీ బాస్ స్పష్టం చేశారు.  జస్టిస్ పీ చంద్రఘోష్ నేతృత్వంలోనే కాళేశ్వరం కమిషన్ మాజీ మంత్రి హరీశ్ రావు  విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా తాను ఇవాళ విచారణకు హాజరుకావడం లేదని కమిషన్‌కు హరీశ్ రావు సమాచారం అందజేశారు. అయితే, కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లనుండటంతో మరో రోజున విచారణకు హాజరవుతానని జస్టిస్ పీ చంద్రఘోష్‌కు సమాచారం అందజేశారు హరీశ్ రావు