Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరోసారి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్
posted on: Jun 14, 2025 3:45PM

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రెండో రోజు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. గత కొంత కాలంగా గులాబీ దళపతి కోల్డ్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసం ఈరోజు (శనివారం) ఉదయం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన వెంట కుటుంబసభ్యులు, మాజీ మంత్రి హరీష్ రావు, తదితరులు ఉన్నారు. నిన్ననే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్ ఈరోజు మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత నందీనగర్లోని నివాసానికి వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు నందీనగర్ నివాసంలో ఉండనున్నాట్లు తెలుస్తోంది.






