కేసీఆర్‌ ఉద్యమం నుంచి తప్పుకోవాలి: మోత్కుపల్లి

posted on: Oct 25, 2011 3:34PM

హైదరాబాద్:టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఉద్యమం నుంచి తక్షణమే తప్పుకోవాలని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్‌ చేశారు. ఎగిసి పడిన ఉద్యమాన్ని నిర్వీర్యం చేసిన కేసీఆర్‌,అందుకు బాధ్యత వహించాలన్నారు. కెసిఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే తన ఆస్తులు ప్రకటించాలని సవాల్ విసిరారు. టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని రాజకీయ పార్టీ అని విమర్శించారు. కెసిఆర్‌కు కావాల్సింది తెలంగాణ కాదని పదవులు మాత్రమేనన్నారు. ఉద్యమాన్ని కెసిఆర్ రూ.4500 కోట్లకు కాంగ్రెసుకుఅమ్మేశారని ఆరోపించారు. కెసిఆర్ నిజమైన ఉద్యకారుడైతే పత్రికలు, పేపర్లు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణకు అసలు ద్రోహి కెసిఆర్ అని ధ్వజమెత్తారు. ఉద్యోగులు 42 రోజుల పాటు సమ్మె చేసి చరిత్రకారులయ్యారన్నారు. ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన కెసిఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.నవంబరు 1న ఢిల్లీలో తాను దీక్ష చేపట్టే సమయంలో టిఆర్ఎస్ రాష్ట్రంలో దీక్షలు చేయడాన్ని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ తప్పు పట్టారు. తన సత్యాగ్రహానికి పోటీ దీక్ష సరికాదన్నారు. తన దీక్షకు తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు ఉందన్నారు. దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదని ఢిల్లీలో అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...