Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేబీఆర్ పార్క్‌లో గంధం దొంగల పట్టివేత
posted on: Oct 17, 2014 9:53AM

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వున్న కేబీఆర్ జాతీయ పార్క్‌లో భారీ స్థాయిలో గంధపు చెట్లు వున్నాయి. గతంలో ఇందిరాపార్క్‌లో వున్న గంధపు చెట్లను గంధపు దొంగలు ఖాళీ చేశారు. ఇప్పుడు వారి కన్ను కేబీఆర్ పార్క్ మీద పడింది. కేబీఆర్ పార్క్‌లో గంధపు చెట్లను నరికేస్తున్న ఐదుగురు గంధం స్మగ్లర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గంధపు చెట్ల దొంగలు పెద్ద పెద్ద రంపాలతో గురువారం రాత్రి కేబీఆర్ నేషనల్ పార్క్‌లో చెట్లను నరుకుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరి వెనుక అసలు సూత్రధారులు ఎవరు వున్నారన్న విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. జాతీయ అటవీశాఖ అధీనంలో వున్న కేబీఆర్ పార్క్‌లో 2 వందలకు పైగా గంధపు చెట్లు వున్నాయి.


.jpg)
.jpg)


