Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కవిత బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్
posted on: Apr 4, 2024 5:42PM
తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న మాజీ సిఎం కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లోబెయిల్ దొరికే అవకాశాలు కనబడటం లేదు. బలమైన ఆధారాలు ఉండటం వల్లే బెయిల్ దొరకడం లేదు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కోర్టు అనుమతితో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమెకు న్యాయస్థానం జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.


.webp)
.webp)


