ఆస్పత్రిలో చేరిన కవిత
Published on: Tue Oct 1, 2024 10:42AM
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రిలో చేరారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కవిత తీవ్ర అనారోగ్యాని గురయ్యారు. రక్తపోటు, గైనిక్ సమస్యలతో బాధపడుతున్న కవిత ఐదున్నర నెలల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఆమెకున్న ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబడటంతో సోమవారం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ రొటీన్ చెకప్ చేయించుకున్నట్లు సమాచారం. గచ్చిబౌలి ఎఐజీ హాస్పిటల్లో ఆమె చేరారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాలు జరపాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రానున్న బతుకమ్మ పండగ నుంచి ఆమె రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


