కౌన్ బనేగా ఢిల్లీ సిఎం? 20న ప్రమాణ స్వీకారం
posted on Feb 17, 2025 1:53PM
ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అనే ఉత్కంఠం నెలకొంది. ఢిల్లీ సిఎం రేసులో అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రిని ఓడించిన పర్వేశ్ వర్మ పేరు ప్రముఖం వినిపిస్తుంది. ఈ నెల 19న శాసనసభాపక్షనేత ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా అధ్యక్షతన ఈ శానససభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ చివరిక్షణంలో వాయిదాపడింది. 20న ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరు ఉపముఖ్యమంత్రుల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది. ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ముఖ్యమంత్రి పేరు ఇంకా బిజెపి ప్రకటించకపోవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.