కత్రినా ఛాన్స్ కొట్టేసింది

Publish Date:Apr 21, 2015

 

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సూపర్ ఛాన్న్ కొట్టేసింది. మొట్ట మొదటిసారి ప్రఖ్యాత కేన్స్ చిత్రోత్సవంలో మెరవనుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ తారలు ఐశ్వరాయ్ బచ్చన్, సోనమ్ కపూర్ లు మాత్రమే కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు వారితో పాటు కత్రినా కైఫ్ కూడా సందడి చేయనుంది. ప్రస్తుతం తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న లోరియల్ సంస్ధ తరుపున కేన్స్ లో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2015 కార్యక్రమానికి హాజరుకానుంది. ఫ్రాన్స్ లోని కేన్స్ లో మే 13 నుండి 24 ఈ ఉత్సవాలు జరగనున్నాయి. భారత్ తరపున మొదటిసారి కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొంటున్నందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందని కత్రినా కైఫ్ తెలిపింది.

By
en-us Political News