రూ.5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

posted on: Feb 21, 2026 8:42PM

 

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే చంద్రులామని లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా అధికారులు వలవేసి పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన శనివారం గడగ్ జిల్లాలో చోటుచేసుకుంది. షిరాహట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

గడగ్ జిల్లాలో నీటి పారుదల శాఖకు సంబంధించిన ఓ పనికి అనుమతి, ఆమోదం కోసం క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్ పూజార్‌ను ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. క్లియరెన్స్ ఇవ్వాలంటే మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్ కర్ణాటకలోని అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త అధికారులుకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు మేరకు లోకాయుక్త పోలీసులు సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో ట్రాప్ ఏర్పాటు చేశారు. మొత్తం రూ.11 లక్షల్లో అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం స్వీకరణకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.ఈ కేసుతో సంబంధం ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో అవినీతి నిరోధక చర్యల్లో లోకాయుక్త కీలక పాత్ర పోషిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...