Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వదినను చంపిన మరిది.. ఎందుకంటే..?
posted on: Mar 22, 2021 1:46PM
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. సొంత వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తులకు నా అనుకున్న వాళ్లపైనే యమా పాశాలుగా మారుతున్నారు కొందరు దుండగులు. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్‌లో ఓ మహిళను సొంత మరిది కొబ్బరి బొండాల కత్తితో హతమార్చాడు.
వివరాల్లోకి వెళితే జహీరాబాద్ మండలం పస్తాపూర్ పంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు షబానాబేగం. భర్త జహంగీర్ సోదరులైన యాకూబ్, ఖాజాల మధ్య ఆదివారం రాత్రి భూ వివాదం గొడవ జరిగింది. వారిద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఖాజా.. కొబ్బరి బొండాలు నరికే కత్తితో బేగంపై దాడి చేసి. మెడపై కత్తి పడటంతో షబానా అక్కడికి అక్కడే కుప్పకూలి పడిపోయింది.
కత్తి వేటుకు గాయపడిన షబానాను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా. మార్గం మధ్యలోనే షబానా మృతిచెందింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎస్‌ఐ వెంకటేశ్ ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు.






