ఉద్యమం ఢిల్లీని కదిలించింది: పొన్నం

posted on: Oct 25, 2011 3:02PM

కరీంనగర్: తెలంగాణ ద్రోహులకు ఈ ప్రాంత ప్రజలే బుద్ధి చెబుతారని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యోగులు చేసిన సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని కదిలించిందన్నారు. సమ్మె విరమణ తర్వాత ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఉద్యమంలో పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని సూచించారు. ఉద్యమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని ముందుకు సాగుతామని ఆయన  స్పష్టం చేశారు.సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు నైతిక ధైర్యం ఇవ్వడానికే తాము రైలు రోకోలో పాల్గొన్నామని చెప్పారు. ఉద్యమ తీవ్రత కేంద్రాన్ని కదిలించిందని త్వరలో తెలంగాణ సమస్య తేల్చే అవకాశముందన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రెచ్చగొట్టే మాటలు మానుకొని విడి పోవడానికి సహకరించాలని కోరారు. మంత్రులు కేబినెట్ సమావేశంలో సకల జనుల సమ్మె తీరుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...