Latest News

ధ్యాన్‌చంద్ జీవితంపై బాలీవుడ్ సినిమా

posted on: Oct 7, 2014 5:53PM

 

అందరూ ‘హాకీ మాంత్రికుడు’ అని పిలిచే ప్రముఖ భారతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక హిందీ సినిమాని రూపొందించనున్నట్టు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ 1928, 1932, 1936 సంవత్సరాలలో ఒలింపిక్ క్రీడల్లో హాకీలో భారతదేశం స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అంతటి గొప్ప క్రీడాకారుడి జీవిత చరిత్రతో సినిమా తీసే అవకాశం రావడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని కరణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సినిమాలో ధ్యాన్‌చంద్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ధరించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...