TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో కాపులు ఓసీలుగా ఉండేది ఇంకా ఆరు నెలలే

Published on: Sun Jun 11, 2017 5:43PM

ఆరు నెలల్లో కాపులు బీసీలుగా మారతారన్నారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. కాపు వెల్ఫేర్.కామ్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి కాపులను బీసీల్లో చేర్చుతామని చాలా మంది ముఖ్యమంత్రులు హామీలిచ్చారని..కానీ చంద్రబాబు దానిని సాకారం చేస్తున్నారని అన్నారు. ప్రతి పని పూర్తయ్యేందుకు ఒక విధానం, కొంత ప్రణాళిక ఉంటాయని, వాటికి తగ్గట్టే పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చినరాజప్ప అన్నారు. టీడీపీ ప్రభుత్వంపై జరుగుతున్న లేనిపోని ప్రచారాలు నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.