విమానంలో నన్ను పీకనులిమి చంపబోయాడు... కన్నయ్య

posted on: Apr 25, 2016 11:22AM

 

ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న కన్నయ్య కుమార్ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. తనను విమానంలో తోటి ప్రయాణికుడు పీకనులిమి చంపబోయాడంటూ కన్నయ్య కుమార్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అంతేకాదు నాపై దాడి చేసిన వారిపై విమాన సిబ్బంది ఏ చర్యలూ తీసుకోలేదు అని కూడా చెప్పాడు. కాగా దీనిపై విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం  దాడి చేసిన వ్యక్తిని పుణె టీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి మనస్ జ్యోతి డేక(33)గా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు.

 

అయితే దీనిపై మనస్ జ్యోతి మాత్రం.. పబ్లిసిటీ కోసం కన్హయ్య ఇదంతా చేస్తున్నాడని.. అసలు తనెవరో కాదు నాకు తెలియదు.. కాలు నొప్పి నుంచి ఉపశమనం కోసం కదలగా తన చేయి కన్హయ్య మెడను రాసుకుంది.. దానికే ఇంతటి నేరం మోపడం సబబు కాదని ఆరోపిస్తున్నాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...