కమలాపురం మునిసిపాలిటీ టీడీపీ సొంతం!

కమలాపురం మునిసిపాలిటీ తెలుగుదేశం వశమైంది. జగన్ సొంత జిల్టా కడపలోని కమలాపురం మునిసిపల్ చైర్మన్ మర్పూరి మేరి, కౌన్సిలర్లు షేక్ సూరి, రాజేశ్వరి, సలీల, నాగమణిలు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో కమలాపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం బలం పదికి పెరిగింది. వైసీపీ సభ్యులు ఎనిమిది మంది మాత్రమే మిగిలిననట్లైంది.  వైసీపీ అధినేత జగన్ సొంత మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డి నియోజకవర్గం అయిన కమలాపురం మునిసిపాలిటీ చేజారడం వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu