Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీఆర్ఎస్ తన దారికి రావాల్సిందే అంటున్న కవిత
posted on: Jul 17, 2025 11:47AM

ఎప్పటికైనా ఇంటి పార్టీ తన దారిలోకి రావాల్సిందేనని.. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. అలాగే తనపై మల్లన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను సమర్ధించి కవిత.. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని.. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు.. అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని పేర్కొన్నారు.
ఇందుకోసం వారు నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్ కు బహిరంగ మద్దతును ప్రకటించారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ ను తాను సమర్ధించానని కవిత చెప్పారు. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెం ట్స్ కు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తాజాగా గురువారం ( జెలై 17) హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.






