Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరో మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత?!
posted on: Jan 31, 2025 3:07PM

కల్వకుంట్ల కుటుంబాన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా స్కాంలు చుట్టుముడుతున్నాయా? అవినీతి, అక్రమార్జన విషయంలో వారు ఆరోపణల ఊబిలో కూరుకుపోయారా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తుంటే ఔననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, కుమారుడూ కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే అరెస్టై బెయిలుపై ఉన్నారు. ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిండా మునిగి ఉన్నారు. ఈ విషయంలో నిధుల మళ్లింపు జరిగిందనీ, దానిలో కేటీఆర్ ప్రమేయానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనీ కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. ఆయనకు ముందస్తు బెయిలు తిరస్కరించాయి. ప్రస్తుతం ఆయన ఏసీబీ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్నారు.
ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై బెయిలుపై విడుదలైన కవితపై అదే మద్యం విషయంలో మరోమారు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సారి ఆరోపణలు కేరళ మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి వచ్చిన తరువాత చాలా కాలం పాటు మౌనాన్ని ఆశ్రయించిన కవిత ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ.. రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అంతలోనే కేరళ మద్యం విధానంలోనూ కుంభకోణం జరిగిందనీ, అందులో కూడా కవిత ప్రమేయం ఉందనీ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆరోపణలకు చేసింది కేరళ విపక్ష నేత వీడీ సతేషన్ చేశారు.
ఢిల్లీలో జరిగిన విధంగానే కేరళలోనే మద్యం విధానంలో పెద్ద కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రధాన పాత్ర పోషించారనీ ఆయన ఆరోపించారు. కవిత పలుమార్లు కేరళ వచ్చి ఓ కంపెనీకి మద్యం ప్లాంట్ల కోసం లాబీయింగ్ చేశారని సతేషన్ ఆరోపణలు గుప్పించారు. కేరళలో అధకారంలో ఉన్న వామపక్ష కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే ఇదంతా జరిగిందన్న నతేషన్ కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేరళలో ఈ మద్యం కుంభకోణం 2023లో జరిగిందని చెప్పిన ఆయన పాలక్కాడ్‌లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ లిమిటెడ్ పేరుతో భారీగా భూములు సేకరించారని , ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసి మరీ ఆ సంస్థకు మద్యం తయారీ లైసెన్సు మంజూరు చేశారని సతేషన్ ఆరోపించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ లు ఏకపక్షంగా వ్యవహరించి మరీ లైసెన్సులు మంజూరు చేశారన్నారు. ఇదంతా కల్వకుంట్ల కవిత కేరళ వచ్చి పెద్దలతో భేటీల తరువాతే జరిగిందని సతీష్ ఆరోపణ. ఈ ఆరోపణలను కవిత ఖండించారు. అయితే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టై బెయిలుపై ఉన్న నేపథ్యంలో తాజా ఆరోపణలపై ఆమె ఖండనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు సరికదా.. నిప్పు లేకుండా పొగరాదుగా అని వ్యాఖ్యానిస్తున్నారు.


.webp)
.webp)


