వడ్డేపల్లి మున్సిపాలిటీ తెలంగాణ జాగృతి కైవసం.. కల్వకుంట్ల కవితకు తొలి విజయం

posted on: Feb 13, 2026 11:35AM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో గద్వాల్ జోగులాంబ జిల్లా వడ్డేపల్లిలో ఫార్వార్డ్ బ్లాక్ జయకేతనం ఎగుర వేసింది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (ఏఐఎఫ్ బి) చిహ్నం అయిన సింహం గుర్తుతో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

ఆ మేరకు ఈ ఎన్నికలలో తెలంగాణ జాగృతి అభ్యర్థులు సింహం గుర్తుపై పోటీలోకి దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపాలిటీలో ఫార్వార్డ్ బ్లాక్ జయకేతనం ఎగురవేయడమంటే.. తెలంగాణ జాగృతి గెలిచినట్లే. వడ్డేపల్లి మునిసిపాలిటీలో మొత్తం పది వార్దవులు ఉండగా ఎనిమిది వార్డులను సింహం గుర్తుపై పోటీ చేసిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన రెండు వార్డులలో కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి దక్కించుకున్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...