TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుకు కలిశెట్టి వినతులు!

Published on: Tue Oct 8, 2024 12:38PM

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు హస్తిన పర్యటనలో ఆయన వెంట ఉన్న కలిశెట్టి  అప్పలనాయుడు చంద్రబాబుకు పలు వినతులు చేశారు. టీటీడీ కల్యాణ మండపాలను ధార్మిక కేంద్రాలుగా మార్చాలని కోరారు. అలాగే రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలకు కూడా వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు.  అలాగే జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్ధరించాలనీ, టోల్ గేట్ల వద్ద ఫ్రీ  పాసులను అందించాలనీ కోరారు. కలిశెట్టి వినతులకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.