కాళేశ్వరం నివేదికపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
posted on Aug 4, 2025 5:14PM

కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు. అది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ పేర్కొన్నారు. కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చుని భయపడవద్దని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం పనికిరాదు అన్న వాడు అజ్ఞాని.. ప్రాజెక్టుపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం కంటే ముందే మీడియాకు లీకు కావడం చర్చనీయాంశమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను నిర్మించారు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి.
ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం ఈ ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్ విచారణ జరిపింది. చివరకు జులై 31వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఆగస్టు 1వ తేదీన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.