ప్రసంగిస్తూ పడిపోయిన కడియం శ్రీహరి...

posted on: Jun 2, 2017 11:30AM

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకల్లో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ లో నిర్వహించిన వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో  వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆయనను వెంటనే లేపి పక్కన కూర్చోబెట్టారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...