Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నన్ను చంపాలనుకున్నోళ్ళే చచ్చారు: పాల్
posted on: May 5, 2014 1:51PM

ఎప్పుడూ కామెడీ స్టేట్‌మెంట్లు ఇచ్చే మత ప్రచారకుడు కేఏ పాల్ తాజాగా చాలా సీరియస్‌గా మాట్లాడాడు. తనను గతంలో చాలామంది చంపాలని అనుకున్నారని, తనను చంపాలని అనుకున్నవాళ్ళే చచ్చారని కేఏ పాల్ చెప్పారు. ఈ స్టేట్‌మెంట్ విన్నాక, పాల్‌ని చంపాలనుకున్నవాళ్ళు.. ఆ తర్వాత చచ్చిపోయినవాళ్ళు ఎవరబ్బా అనే ఆలోచన రాష్ట్రంలో మొదలైంది. చాలామంది మనసులలో ఒక పేరు స్ఫురించినప్పటికీ, పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులూ అనే పాట గుర్తొచ్చి సైలెంట్‌గా వుండిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకూ స్ఫురించింది కదూ.. అయితే మనసులోనే పెట్టేసుకోండి. అన్నట్టు కేఏ పాల్‌కి వైసీపీ అధినేత జగన్ మీద పీకలదాకా కోపం వున్నట్టుంది. జగన్ పేరు చెబితేనే పాల్ పాలు మరిగినట్టు మరిగిపోతున్నాడు. జగన్ ఈ ఎన్నికలలో పొరపాటున కూడా గెలవడని ప్రార్థనల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాడు. ఒకప్పుడు బిజీ మత ప్రచారకుడిగా వున్న కేఏ పాల్‌ని అణగదొక్కేసి, బ్రదర్ అనిల్‌కుమార్ని మత ప్రచారకుడిగా పైకి తేవడానికి కుట్ర జరిగిందన్న అభిప్రాయాలు జనంలో వున్నాయి. ఈ కుట్రలో భాగంగానే కేఏ పాల్ మీద ఏవేవో కేసులు పెట్టి జైల్లో వేయించారన్న అభిప్రాయలు కూడా వున్నాయి. అందుకే కేఏ పాల్ ఇప్పుడు జగన్ మీద విరుచుకుపడుతున్నాడు.






