TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గద్దర్ గాయెబ్.. మునుగోడు ప్రజాశాంతి పార్టీ ఆభ్యర్థిగా పాల్

Published on: Sat Oct 15, 2022 10:04AM

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ రంగంలోకి దిగుతారని ప్రచారమైనా చివరి నిముషంలో ఆయన గాయబ్ కావడంతో రంగంలోకి స్వయంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దిగారు. ఇక నామినేషన్ లకు గుడువు ముగుస్తుందనగా చివరి నిముషంలో కేఏ పాల్ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.

వాస్తవానికి ఈ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ ను నిలబెడుతున్నట్లు పాల్ స్వయంగా కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఏం జరిగిందో కానీ.. చివరి నిముషంలో పాల్ స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే తానే స్వయంగా నిమినేషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందో పాల్ వివరించారు.

నామినేషన్ వేయకుండా గద్దర్ ను పోలీసులు అడ్డుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తానే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. డబ్బు ఆశ చూపుతూ జనాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో ఓటుకు  రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.