TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీజేఐగా జ‌స్టిస్ ల‌లిత్ ప్ర‌మాణ‌స్వీకారం

Published on: Sat Aug 27, 2022 12:19PM

భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్  శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము జస్టిస్ యు.యు.లలిత్తో ప్రమాణ స్వీకారం చేయించారు.

\ఈ  ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్,  ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.సీజేఐగా జస్టిస్ ఎన్.వి. రమణ పదవీ విరమణ చేయడంతో జస్టిస్ యు.యు.లలిత్ కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కూడా పాల్గొన్నారు.