Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ స్పీకర్ కి పితృవియోగం
posted on: Dec 1, 2018 12:19PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తండ్రి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.పున్నయ్య (96) కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన అక్టోబర్ 26న ఆస్పత్రిలో చేరారు. అదే సమయంలో ఆయన కుమార్తెకు గుండెనొప్పి రావడంతో హైదరాబాద్ తరలించారు. బైపాస్ సర్జరీ అనంతరం ఆమె కోలుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన పున్నయ్య 1952లో రెండేళ్లపాటు శ్రీకాకుళం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. కొన్నాళ్ళకు రాజకీయాలను వదిలేసి తిరిగి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదిగా 1974-85 వరకూ పనిచేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2000 సంవత్సరంలో ఎన్డీఎ ప్రభుత్వం నియమించిన రాజ్యాంగ సమీక్షా కమిటీ 11 మంది సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గానూ పనిచేశారు.






