Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జూబ్లీ బైపోల్ లో పార్టీల ఎన్టీఆర్ భజన అందుకోసమేనా?
posted on: Nov 1, 2025 5:26PM

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. అన్ని పార్టీల దృష్టీ తెలుగుదేశం వైపే ఉంటుంది. విభజన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో క్రీయాశీల రాజకీయాలకు ఒకింత దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకు ప్రధాన కారణం పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం లేకపోవడమే. తెలంగాణలో తెలుగుదేశం నాయకులంతా వేర్వేరు కారణాలతో తమ దారి తాము చూసుకున్నా.. పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఆ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం ఎన్నికల సమయంలో అర్రులు చాస్తుంటాయి. ఇసుమంతైనా భేషజానికి పోకుండా తెలుగుదేశం జెండా మోస్తుంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రస్, బీజేపీ సహా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం జెండా చేతబట్టి ప్రచారం చేయడాన్ని మనం చూశారు. ఇప్పుడు జూబ్లీహాల్స్ ఉప ఎన్నిక వేళ కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా తెలుగుదేశం అండ కోసం అర్రులు చాస్తున్నాయి.
తెలుగుదేశం ప్రాపకం పొందేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కొన్ని రోజుల కిందట తన ప్రచారంలో ఎన్టీఆర్ ను స్మరించు కున్నారు. తన భర్త, దివంగత మాగంటి గోపీనాథ్ కు ఎన్టీఆర్ పిత్రు సమానులని చెప్పుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా మాగంటిని పుత్ర వాత్సల్యంతో ఆదరించారని చెప్పుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో హైదరాబాద్ నడిబొడ్డున అంటే మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన ప్రస్తావన తెచ్చారు. ఆయన విగ్రహాన్ని మైత్రీవనంలో ఏర్పాటు చేయించి తానే ఆవిష్కరిస్తానని చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం జూబ్లీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎటుమెగ్గు చూపితే అటే విజయం వరిస్తుందన్న నమ్మకమే అని పరిశీలకులు అంటున్నారు.
ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. ఆ పార్టీ అధినాయత్వం ఎన్డీయేతో పొత్తు నేపథ్యలో బీజేపీకే మద్దతు ఇవ్వాలని క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. తెలంగాణలో పార్టీలన్నీ తెలుగుదేశం భజన చేస్తున్నాయని చెప్పక తప్పదు.





