అమెరికా ఉపాధ్యక్షుని భారత పర్యటన

 

దాదాపు 30 ఏళ్ల తరువాత అమెరికా ఉపాద్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నాడు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా బాద్యతలు నిర్వహిస్తున్న జోసెఫ్ జో బిడెన్ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జోబిడెన్ భారత్ పలు రంగాల్లో మరింత ఆర్ధిక సరళీకరణ విధానాలు అమలు చేసే దిశగా చర్చలు జరపనున్నారు.


పర్యటనలో భాగంగా జో పలువురు రాజకీయనాయకులతో సమావేశం కానున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రదాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ తోపాటు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ లతో భేటి కానున్నారు. హెచ్ 1 బి వీసాల విషయంలో భారత్ పట్ల అమెరికా అనుసరిస్తున్నవిధానాన్ని కూడా చర్చించనున్నారు.


తరువాత ముంబైలోని పలువురు రాజకీయ పరిశ్రామిక వేత్తలను కూడా కలవనున్నారు.. పర్యటనలో భాగంగా తొలి రెండు రోజులు ఢిల్లీలో పర్యటిస్తున్న బిడెన్ తరువాత రెండు రోజుల పాటు భారత ఆర్ధిక రాజధాని ముంబైలో పర్యటించనున్నారు.