Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ పై జేసీకి ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకో..?
posted on: Jan 4, 2019 1:34PM

ఏపీలో పొత్తులపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని, అవసరమైతే వైకాపా అధినేత జగన్ ని కూడా మిత్రుడిగా చేసుకోటానికి సిద్ధమని తెలిపారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..మోడీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజాభిప్రాయం గౌరవించకుండా లోక్‌సభ నుంచి తమను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. సభ జరిగేంత వరకూ రావొద్దు చెప్పడం ఎంత వరకు సబబని అన్నారు. రాయలసీమలో ఓ ముఠా నాయకుడి స్థాయిలో ప్రధాని మోడీ తీరు ఉందని జేసీ మండిపడ్డారు. ప్రధానిగా ఉంటూ ఓ బజారు మనిషిలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధానిగా అసత్యాలు మాట్లాడటానికి సిగ్గు లేదా అని నిలదీశారు. దేశానికి మోడీ అసమర్థ ప్రధాని అని అన్నారు. చంద్రబాబు ఏకు మేకై కూర్చాంటారనే భయం మోదీకి పట్టుకుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రానికి దుష్టశక్తి... నేడు బీజేపీ దేశానికే దుష్టశక్తి అని జేసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మోడీని తిట్టటం పక్కన పెడితే...ఎప్పుడు జగన్ పై విమర్శలు గుప్పించే జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అంతేకాకుండా ఇంత అర్ధాంతరంగా జగన్ పై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అనే చర్చ జరుగుతుందట. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయకుల పనితీరు, ప్రవర్తనను బట్టి టికెట్ ఇస్తా అని ప్రకటించారు. జేసీ కూడా నాకు, నాకు తమ్ముడికి టికెట్ ఇవ్వకున్నా పర్వాలేదు అనంతపురం జిల్లాలో నాయకులందరినీ మార్చాలన్నారు. జేసీ ముందే ఫిక్స్ అయ్యారేమో ఎప్పుడు వివాదాలతో ఉండే తనకి, తన తమ్మునికి టికెట్ రాదని అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని కల్లబొల్లి కబుర్లు చెప్తూ తప్పని పరిస్థితులలో పార్టీ మారటానికి పనికొస్తుందని ఈ కపట ప్రేమ చూపిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






