TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబే న్యాయం చేయగలడు...

Published on: Mon May 22, 2017 4:50PM

 

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగాలంటే చంద్రబాబే మళ్లీ గెలవాలని... చంద్రబాబు స్థానంలోకి మరే నాయకుడు వచ్చినా రాష్ట్రానికి న్యాయం చేయలేడని చెప్పారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి, రాయలసీమకు ఎక్కువ నీటిని తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోతిరెడ్డిపాడు వల్ల రాయలసీమకు నీరు వస్తోందని చెప్పారు.