Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీ‘జేపీ’కి జేపీ ప్రచారం
posted on: Apr 26, 2014 5:22PM
.jpg)
రాజకీయాల్లో బోలెడు చిత్రాలు జరుగుతూ వుంటాయి. ఎన్నికల సందర్భంగా ఆ చిత్రాలు మరింత చిత్రాతి చిత్రంగా జరుగుతూ వుంటాయి. అలాంటి చిత్రాల్లో ఇదొక చిత్రం. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జయప్రకాష్ నారాయణకి అనుకూలంగా జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని అనుకున్నారు. దీనికోసం జేపీకి మాట కూడా ఇచ్చేశారు. అయితే పవన్ బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి, మల్కాజ్‌గిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నారు కాబట్టి పవన్ అక్కడ ప్రచారం చేయడం న్యాయం కాదని టీడీపీ, బీజేపీ మొత్తుకున్నాయి. అయినా సరే జేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తానని పవన్ ఊగాడు. అయితే రాష్ట్రానికి మోడీ వచ్చి వెళ్ళడం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం ఇలాంటి పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ జేపీకి అనుకూలంగాప్రచారం చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. తనకు ప్రచారం చేయొద్దని బీజేపీ అడ్డు పడినా జేపీ దాన్ని లైట్‌గా తీసుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయకి అనుకూలంగా ప్రచారం చేయాలని జయప్రకాష్ నారాయణ నిర్ణయించుకున్నారు. ఆదివారం నాడు జేపీ సికింద్రాబాద్‌లో బీజేపీకి ప్రచారం చేయబోతున్నారు.



.jpg)


