16 ఏళ్ళ అమ్మాయి పై.. ముగ్గురు అబ్బాయిలు..  

posted on: Mar 20, 2021 11:53AM

ఆ  అమ్మాయికి 16 ఏళ్ళు. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి పిలిచాడని వెళ్ళింది. కానీ, ఆ బర్త్ డే పార్టీ  చాటున  ప్రమాదం ఉందని గ్రహించలేదు ఆ అమ్మాయి. పార్టీకి వెళ్లిన ఆమెపై ముగ్గురు కుర్రాళ్లు అత్యాచార* చేశారు. ఆ విషయం ఎవరికైనా చెబితే చ*పేస్తామని బెదిరించారు. ఆ బాధ భరించలేని ఆ బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. ఇక అంతే ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది. తన కూతురుకు వచ్చిన కష్టంపై న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుని. నేరుగా మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సాధారణంగానే ఈ కేసు విచారణ కూడా సుదీర్ఘంగానే కొనసాగింది. అయినప్పటికీ ఎట్టకేలకు తీర్పు వచ్చింది. ఆమెకు న్యాయం జరిగింది. అసలు ఏం జరిగిందో చూద్దాం.. 

16 ఏళ్ల ఓ బాలిక స్నేహితుడు పిలిచాడని పుట్టిన రోజు వేడుకకు వెళ్లింది. అతడు ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడకు అతడి మరో ఇద్దరు స్నేహితులు కూడా వచ్చారు. వారు ముగ్గురు ఆ బాలికను బెదిరించి, భయపెట్టి ఆమెపై అత్యాచార* చేశారు. తనను వదిలేయమని ప్రాథేయ పడినా వినలేదు. అత్యాచార* చేసి ఎవరికైనా చెబితే చ*పేస్తామని బెదిరించి ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన 2018వ సంవత్సరం సెప్టెంబర్ 25న జరిగింది. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి తన ఇంటికి చేరుకుంది. ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

దీంతో ఆ తల్లిదండ్రులు వెంటనే స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు కొన్ని నిజాలు తెలిశాయి. దారుణానికి పాల్పడిన ముగ్గురు కుర్రాళ్లు మైనర్లేనని తేలింది. మొత్తానికి రెండున్నరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం దీనికి సంబంధించిన కేసులో కోర్టు తుది తీర్పు వెల్లడయింది. దారుణానికి పాల్పడిన ముగ్గురు మైనర్లకు జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో ఒక్కొక్కరికీ 42వేల రూపాయల జరిమానా కూడా విధించింది. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...