తెలంగాణ మునిసిపోల్స్.. బీజేపీ అభ్యర్థుల తరఫున జనసేనాని ప్రచారం

posted on: Feb 4, 2026 11:47AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో  జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించింది.  జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మంగళవారం (ఫిబ్రవరి 3)  రాత్రి పొద్దుపోయిన తరువాత భేటీ అయ్యారు. ఆ  భేటీలో ఈ మేరకు అంగీకారం కుదిరింది.  పవన్ కల్యాణ్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ మునిసిపల్ ఎన్కలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఈ మేరకు జనసేన కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.  తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ కల్యాణ్ ఈ నెల 7, 8 తేదీలలో ప్రచారం చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన ప్రకటన పేర్కొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...