Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జన్ ధన్ ఖాతాలు ఇక కనుమరుగేనా?!
posted on: May 15, 2023 8:07AM
దాదాపు తొమ్మిదేళ్ళ కిందట ఆర్భాటంగా.. ఒక అద్భుత ప్రాయోజిత పథకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పి.ఎంజేడీవై) పథకం క్రమంగా నిర్వీర్యమవుతోంది. 2014 ఆగస్టులో తన మాసన పుత్రికగా మోడీ ఆవిష్కరించిన ఈ ప్రతిష్టాత్మక పథకం ఇప్పుడు జనాదరణ కోల్పోతోంది. ఏడాది కాలంగా ఆర్ధిక లావాదేవీలు స్తంభించడంతో జనధన్ ఖాతాలన్నిటినీ మూసివేయడానికి బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 2,23,218 పీఎంజేడీవై ఖాతాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 1,18,55,126 ఖాతాదారులున్నారు. వీటిలో 80 శాతానికి పైగా ఖాతాల్లో ఆర్ధిక లావాదేవీలు నిలిచి పోయి చాలా కాలమైంది. బ్యాంకులు పలు సార్లు మెసేజ్ రూపంలో అల్టిమేటం ఇచ్చినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో మెజారిటీ ఖాతాలను బ్లాక్ లిస్టులో పెట్టేశారు. 2023 మార్చి నెల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా కింద బ్యాంకులలో ఉన్న ఖాతాల సంఖ్య 48.85 కోట్లు. ప్రస్తుతం ఈ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.1,98,844.34 కోట్లు జమ అయ్యాయి.
దాదాపు 4.08 కోట్ల ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. నో క్యాష్.. నో ట్రాన్సాక్షన్స్ సాకుతో వివిధ జాతీయ, షెడ్యూల్ ఇప్పటికే శాలను బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. ఆర్ధిక లావాదేవీలే ఆధారంగా ఖాతాల కొనసాగింపునకు బ్యాంకులు అల్టిమేటంతో సంప్రదించిన వారందరికీ సేవింగ్ ఖాతాలుగా మార్చుకోవాలని అధికారులు సెలవిస్తున్నారు. ఇది ప్రభుత్వాదేశాలు ఏమాత్రం కావని, స్తంభించిన ఖాతాలను సేవింగ్ కోసం మార్చుకోవాలని మౌలిక సూచనలు మాత్రమేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణ ఖాతాలు కావడంతో డబ్బులు జమ చేసేందుకు ఆసక్తి. చూపని ఖాతాదారులు ఆశించిన ప్రయోజనాలేమీ కనిపించకపోవడంతో ఇక మాకొద్దులే.. అని వదిలేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకానికి రెండు కోణాల్లో ముప్పు వాటిల్లుతోంది. కేంద్రం ఆదరణ తగ్గిపోవడం ఒకటైతే.. ఖాతాదారుల్లో అవగాహన లోపం మరొకటిగా పీఎంజేడీవై పథకం నిర్వీర్యానికి గురవుతోంది.
ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 647 బీమా క్లెయిమ్ లు కేంద్రానికి అందాయి. వాటిలో 928 క్లెయిమ్లను మాత్రమే పరిష్కరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 941 క్లెయిమ్ లు వచ్చాయి. వాటిలో 182 క్లెయిమ్స్ సెటిల్ చేయగా, 48 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 111 బ్లెయిమ్లు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో ప్రభుత్వానికి కూడా తెలియదు. సెటిల్ చేసిన క్లెయిమ్ ల కోసం రూ.2.27 కోట్లు చెల్లించారు. అదేవిధంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 306 17 యిమ్ లను పరిష్కరించారు. 10. క్లెయిమ్లు తిరస్కరించారు. మిగిలిన 149 దరఖాస్తులు ప్రస్తుత పరిస్థితి ఏంటో గవర్నమెంట్ వారికి సైతం తెలియదు. గత ఆర్థిక సంవత్సరంలో సెటిల్ అయిన కేసుల రూ.1.88 కోట్లు చెల్లించారు.
పథకం కింద ఖాతాదార్లకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. గతంలో ఈ కవరేజీ రూ.1 లక్షగా ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదార్లు బ్యాంక్ ఖాతాతో పాటు రూపే కెవిట్ కార్డును పొందుతారు. ప్రమాద బీమా పరంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల లోపు, ద ఖాతాదారు తన రూపే కార్డును ఉపయోగించి ఏదైనా లావాదేవీ జరిపినట్లయితే, అతను ||మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హుడు అన్న షరతు ఉంది. చాలా సందర్భాలలో క్లెయిమ్ తిరస్కరణకు ఈ షరతే కారణం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి.. ప్రజలకు ఏదో చేసెద్దామని రూపకలగపన చేసిన పథకం.. నేడు సొంత ఆదరణ కరవై.. నిర్వీర్యం అవుతున్న తరుణంలో.. ఖాతాలను సేవింగ్ అకౌంట్ గా మార్చుకోమని బ్యాంకులు..గగ్గోలు పెడుతున్న తరుణంలో... ప్రధాని గాని, ప్రధాన మంత్రి కార్యాలయం గాని దీనిపై తగిన వివరణ ఇవ్వకపోవడం.. గమనార్హం.






