తెలంగాణ పురపోరులో జనసేన బోణీ
posted on: Feb 13, 2026 1:23PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణ పురపోరులో రంగంలోకి దిగిన జనసేన అభ్యర్థుల తరఫున పార్టీ అధినేత ప్రచారానికి రాకపోయినా ఆ పార్టీ అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించడం విశేషం.
తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని అంటున్నారు. తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన 200కు పైగా స్థానాల్లో పోటీ చేసింది.


.webp)
.webp)


