TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్మీ క్యాంపుపై దాడి.. ముగ్గురు సైనికులు మృతి....

Published on: Thu Apr 27, 2017 10:24AM

 

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో కుప్వారా జిల్లాలో  చోకిబ‌ల్‌లో ఉన్న ఆర్మీ క్యాంపుపై దాడులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు చ‌నిపోగా.. మ‌రో అయిదుగురు గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో ఓ ఆర్మీ ఆఫీస‌ర్, జూనియ‌ర్ క‌మీష‌న‌ర్ ఆఫీస‌ర్‌తో పాటు మ‌రో జ‌వాను ఉన్నారు. మరోవైపు భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. జైషే మొహ‌మ్మ‌ద్‌ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన మిలిటెంట్లు ఆర్మీ క్యాంపుపై దాడి చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. కాగా ఉగ్ర‌వాదులకు, భద్రతాబలగాలకు ఇంకా ఎదురుకాల్పులు జ‌రుగుతున్నాయి.