Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీఆర్ఎస్ లో లొల్లి.. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఘర్షణ
posted on: Apr 2, 2019 5:26PM

ఇతర పార్టీల నేతల చేరికతో కళకళలాడుతూ లోక్ సభ ఎన్నికల పోరుకి దూసుకెళ్తున్న టీఆర్ఎస్ కు.. ఇంటిపోరు మొదలైంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతల వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రాములుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని.. కల్వకుర్తి ఎమ్మెల్యే జయ్‌పాల్‌యాదవ్ వర్గీయులు అడ్డుకున్నారు. ప్రచార వాహనంపై ఎమ్మెల్యే ఫొటో లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే జయ్‌పాల్‌యాదవ్ వర్గీయులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ప్రచారం కొనసాగింది.






