హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదు

posted on: Nov 30, 2018 2:21PM

 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ తాజాగా సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం కాదని, బ్లఫ్ మాస్టర్ విమర్శించారు. తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పార్లమెంట్‌లో కేసీఆర్ లేనేలేరని అన్నారు. కేసీఆర్‌ది దీక్షనే కాదని, ఏసీ గదిలో దీక్ష చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపడం ఖాయమన్నారు. హైదరాబాద్‌ వండిపెట్టిన బిర్యాని లాంటిదని.. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి బ్రహ్మానందరెడ్డి, చంద్రబాబు, వైఎస్‌, ఎన్టీఆర్ కృషే చేశారని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు హోదా అడగడం నమ్మక ద్రోహమేనని విమర్శించారు. విభజనచట్టం హామీలు అమలుచేయాలని కేసీఆర్, మోదీని అడగలేదని జైరాం రమేష్ అన్నారు.

మరో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జునఖర్గే కూడా కేసీఆర్ మీద విమర్శల దాడి చేశారు. తాజాగా గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఆమెతో కేసీఆర్‌ ఫొటో దిగారని గుర్తుచేశారు. నాడు ఫొటో దిగి, ఇప్పుడు శత్రువులమంటున్నారని ఆయన మండిపడ్డారు. మోదీ సర్కార్‌కు అనేక విషయాల్లో కేసీఆర్‌ మద్దతిచ్చారన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీకి కేసీఆర్‌ మద్దతిచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని ఖర్గే విమర్శించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...