Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పులివెందులలో జగన్ గెలిచేది డౌటే?!
posted on: May 15, 2024 4:01PM
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ చాప చుట్టేసినట్టు అందరికీ అర్థమైపోయింది. వైసీపీ శ్రేణులు కూడా ఈ చేదు వాస్తవాన్ని అర్థం చేసుకుని ముఖాలు వాడిపోయి కనిపిస్తున్నారు. జగన్‌కి అధికార ప్రతినిధి లాంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ‘‘రాజకీయాలు అన్న తర్వాత గెలుపు, ఓటములు సహజం. అందువల్ల వైసీపీ కార్యకర్తలు బెట్టింగ్‌లు పెట్టి డబ్బు వేస్టు చేసుకోవద్దు’’ అని సాక్షి టీవీ సాక్షిగా పిలుపు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి లబోదిబోమంటున్నారంటే కూడా మేటర్ క్లారిటీగా వున్నట్టు లెక్క.ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు దాడులు, హింసా కార్యక్రమాలు మానుకుని బుద్ధిగా వుంటే మంచిది. అసలు విషయం చెప్తే వైసీపీ క్యాడర్‌కి నిద్ర కూడా పట్టదు.. అదేంటంటే.. పులివెందులలో జగన్ గెలవటం కష్టమే...
జగన్ ఓడిపోవడమా... అసంభవం అని అనుకుంటున్న వాళ్ళు భ్రమలు వదిలి వాస్తవంలోకి వస్తే మంచింది. ఇందిరా గాంధీని, ఎన్టీఆర్‌ని, నిన్నగాక మొన్న కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని ఓడించిన ఓటర్లు మనవాళ్ళు. వాళ్ళందరికంటే జగన్ తోపూ తురుంఖానూ ఏమీ కాదు. జగన్ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. ఇంకా ఈ విషయంలో ఏవైనా సందేహాలు వున్నవాళ్ళు పులివెందుల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చూస్తే క్లారిటీ వస్తుంది.
పులివెందుల టీడీపీ కార్యాలయం కార్యకర్తల సందడితో కళకళలాడిపోతోంది. అందరూ జగన్ మీద పోటీ చేసిన బీటెక్ రవికి ముందస్తు అభినందనలు చెబుతున్నారు. వచ్చేపోయే కార్యకర్తలతో టీడీపీ ఆఫీసు తిరణాలని తలపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు, బీటెక్ రవి ముఖాల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే, ‘వైనాట్ 175’ లాగా ‘వైనాట్ జగన్’ అనాలని అనిపించడం ఖాయం.


.webp)
.webp)


