భారతికి జగన్ విడాకులు ఇస్తారా?

posted on: Apr 29, 2024 11:31AM

గతంలో కంటే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ఎన్నికల ప్రచారం స్పీచ్‌ల్లో పంచ్‌లు పేలుతున్నాయి. గతంలో ఆయన క్లాస్ భాష మాట్లాడేవారు. ఆయన మాటలు మరీ మాస్ జనాలకు ఆలస్యంగా అర్థమయ్యేది. ఈమధ్యకాలంలో ఆయన మాస్ పల్స్ బాగా పట్టుకున్నారు. 75 సంవత్సరాల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్న ఆయన, తన ప్రసంగాల్లో కూడా భారీ స్థాయిలో పంచ్‌లు పేల్చుతున్నారు. ఏ ఇష్యూ మీద అయినా  జగన్ మీద పక్కా మాస్ పంచ్‌లు వేస్తున్నారు. ఒక్కొక్కసారి ఈయన ఆయనేనా అనుకునే విధంగా పంచ్‌లు ప్రవహిస్తున్నాయి. 

వైఎస్ షర్మిల పసుపుపచ్చ చీర కట్టుకోవడం మీద జగన్ కామెంట్ చేయడం భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. తన చెల్లెలు పచ్చ చీర కట్టుకుందని విమర్శించిన జగన్ మీద చంద్రబాబు పంచ్‌లతో విరుచుకుపడ్డారు. షర్మిల పచ్చ చీర కట్టుకుంటే తప్పు, మరి జగన్ భార్య భారతి పసుపు పచ్చ డ్రస్ వేసుకుని, జగన్‌తో కలసి ఫొటోలకు పోజులిచ్చింది.. మరి జగన్ ఇప్పుడేం చేస్తారు.. ఆమెకు విడాకులు ఇస్తారా అని చంద్రబాబు పంచ్ వేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...