Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చార్జిషీటులో భారతి పేరు..!!
posted on: Aug 10, 2018 12:17PM
ప్రతిశుక్రవారం కోర్ట్ కు హాజరవుతున్న జగన్, ఇకనుండి సతీసమేతంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. జగన్ అక్రమాస్తుల కేసులో మొదటిసారి ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి.. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల చార్జిషీటు దాఖలు చేసింది.. అయితే భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో బాగా ప్రచారం జరిగింది.. కానీ సీబీఐ ఆ పనిచేయలేదు.. సీబీఐ వదిలేసినా ఈడీ దర్యాప్తు నుంచి భారతి తప్పించుకోలేకపోయారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ చార్జిషీటు దాఖలు చేశారు.. ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్ట్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.. మొన్నటివరకు జగన్, మోదీతో కలిసిపోయారని ఆరోపణలు వినిపించాయి.. అసలు కేసులు మాఫీ చేసుకోవడానికే జగన్, మోదీతో చేతులు కలిపారని చాలామంది ఆరోపించారు.. కానీ ఇప్పుడేం జరిగింది? జగన్ కేసులు పోవడం ఏమో కానీ కొత్తగా భారతి పేరు కూడా చార్జిషీటులో చేరింది.. ఈడీ, సీబీఐ కేంద్రం చెప్పినట్టే నడుస్తున్నాయి.. మరి మోదీకి తెలియకుండానే ఇదంతా జరిగిందా?.. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది.. మోదీ, జగన్ ని పూర్తిగా నమ్మట్లేదు అందుకే కేసుల్ని అడ్డం పెట్టుకొని జగన్ ని గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తున్నారని కొందరు అంటుంటే.. జగన్ ని కావాలనే బలహీనపరిచి వచ్చే ఎన్నికల్లో పవన్ తో దోస్తీ చేయాలని చూస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు.. ఇవన్నీ గ్రహించిన జగన్, బీజేపీకి అందుకే ఇప్పుడు కాస్త దూరంగా ఉంటున్నారని.. ఒకప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో అడగకుండానే బీజేపీ మద్దతిచ్చిన జగన్, ఈమధ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండటానికి కారణం ఇదే అయ్యుండొచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.. అసలు బీజేపీ, జగన్ మనసుల్లో ఏముందో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే ఇలాంటి ఆరోపణలు, అభిప్రాయాలూ మాత్రం వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై స్పందించిన జగన్.. 'నా భార్య పేరు చార్జిషీటులో ఉందని ఓ సెలెక్టెడ్ మీడియాలో వచ్చిన వార్త విని షాకయ్యాను.. ఇది చాలా బాధాకరం.. కుటుంబాలను ఇలాంటి విషయాల్లోకి లాగడం సబబు కాదు.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను చూసినప్పుడు బాధేస్తుంది' అన్నారు.






