Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ ముగ్గురు మంత్రులకి క్లాస్ తీసుకున్న జగన్ ?
posted on: Jul 6, 2019 2:26PM

ఏపీ సీఎంగా బాద్యతలు చేపట్టిన జగన్ ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. ఒకప్పుడు అవినీతి అంటే కేరాఫ్ అని తన మీద జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన కొందరు మంత్రులను పిలిచి మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది, మామూలుగా పిలిచి మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ ఆయన పిలిచి గట్టిగా మాట్లాడాడట. అదేనండీ మన బాషలో మాట్లడాలి అంటే క్లాస్ పీకారట.
నిజానికి జగన్ మంత్రులను ఎలా నియమించారో వారు చేసే పనులను ఎప్పటికప్పుడు తనకు చేరవేసే టీంని కూడా నియమించుకున్నాడట. అయితే ఈ విషయం తెలియని కొందరు మంత్రులు తమ పరిధి దాటి ఏదో చేయ ప్రయత్నం చేయడంతో జగన్ వారిని పిలిచి పాము చావకుండా కర్ర విరక్కుండా క్లాస్ పీకారట. ఆ క్లాస్ పీకించుకున్న వారిలో ఒక సీనియర్ మంత్రి, ఇద్దరు జూనియర్ మంత్రులు ఉన్నారట. జగన్ మాత్రమే చూడాల్సిన రాజధాని ప్రాంత కట్టడాల విషయం మీద అధికారులతో సమీక్షలు చేస్తున్న ఓ సీనియర్ మంత్రికి జగన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం.
ఆ మంత్రికే కాక జగన్ మరో ఇద్దరు జూనియర్ మంత్రులకు కూడా జగన్ క్లాస్ తీసుకున్నాడని సమాచారం. అది ఎందుకు అంటే ఒక జూనియర్ మహిళా మంత్రి అలాగే మరో మంత్రి భంధువులు అప్పుడే మంత్రుల పేర్లు చెప్పి పైరవీలకు తెరతీశారని, ఆ విషయాన్ని పరోక్షంగా పేర్కొని జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారట. నిజానికి జగన్ తన మీద ఉన్న అవినీతి మరక పోగొట్టుకోవాడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందుకే చేసే ప్రతి పనీ జనాలు గుర్తు పెట్టుకునేలా, తనదైన శైలిలో చేసుకుంటూ పోతున్నారు.
ఇక పాలనలో తనకి సలహాలు ఇవ్వడానికి మాజీ ఐఏఎస్ ల సహాయం తీసుకుంటూ వారి అనుభవాన్ని తన పాలన కోసం వినియోగించుకుంటున్నారు. అందుకే తాను మాత్రం అవినీతి చేయకుండా ఉంటే చాలదని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎటువంటి ఇల్లీగల్ వ్యవహారాల్లో వేలు పెట్టకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని కోసం ప్రత్యేక పర్సనల్ నిఘా విభాగాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం.






